తాజా వార్తలు

Saturday, 28 November 2015

ఏపీకి మళ్లీ వర్ష సూచన

ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.  బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్లు చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.  అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని తెలిపింది. మూడు రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలు మళ్లీ వర్ష సూచనతో భయంతోవణికి పోతున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment