తాజా వార్తలు

Tuesday, 3 November 2015

మళ్లీ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం

ఆంధ్రప్రదేశ్ లోని పలు యూనివర్శిటీల్లో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతోంది. మొన్నటి వరకు ర్యాగింగ్ ర్యాగింగ్ తో పలువురు విద్యార్థులు మృతి చెందడంతో అలర్టయిన సర్కార్ కఠిన చర్యలు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. తాజాగా.. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వర్సిటీ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన లేడిస్ హాస్టల్ లో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట స్వైరవిహారం చేస్తున్నట్లు తెలిసింది. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్‌లో ర్యాగింగ్‌పై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ర్యాగింగ్ విషయం తెలుసుకున్న ఆయన హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ర్యాగింగ్‌పై జూనియర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి వెంట ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, అధికారులు ఉన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment