తాజా వార్తలు

Monday, 2 November 2015

వంగవీటి హత్యకి చంద్రబాబు స్కెచ్ ...?


తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం తాజాగా ఒక అంతర్మధనం జరుగుతోంది. రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి, మరింత స్థిరమైన ఓటు బ్యాంకును సృష్టించుకోవడానికి, తద్వారా ప్రత్యర్థి పార్టీల అవకాశాలను తమకు అనుకూలంగా మళ్లించుకోవడానికి ప్లాన్‌ చేస్తున్న వ్యవహారం బెడిసి కొట్టే పరిస్థితి ఏర్పడడం వారికి మింగుడు పడడం లేదు. సరిగ్గా కాపులను బీసీల్లో చేర్చాలనే అంశాన్ని ఏపీ కేబినెట్‌ ఎజెండాలో చర్చించడానికి నిర్ణయించుకున్న సమయంలోనే.. కాపునేత వంగవీటి రంగాను చంద్రబాబునాయుడు హత్య చేయించినట్లుగా మాజీ ఎంపీ హరిరామజోగయ్య ఆరోపణలు గుప్పించడం వారికి ఇప్పుడు గొంతులో పచ్చివెలక్కాయలా మారింది. నిజానికి చంద్రబాబు మీద ఈ ఆరోపణలు కొత్త కాదు. ఆరోపణల గురించి పార్టీకి దిగులు కూడా లేదు. కాకపోతే.. ఈ ఆరోపణలు చర్చల్లోకి వచ్చిన సమయం అనుకూలంగా లేదని వారు ఆందోళన చెందుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చేసే నిర్ణయం అయితే.. కాపు కులాన్ని ఉద్దరించిన నేతగా చంద్రబాబు అవుతాడని అనుకుంటూ ఉంటే.. కాపుల పెద్దదిక్కును హతమార్చిన నేతగా ఇప్పుడే పతాక శీర్షికల ప్రచారం మొదలు కావాలా అని వారు అనుకుంటున్నారు. 
రాష్ట్రంలో కాపులను తమ పార్టీకి అనుకూలంగా చేసుకోగలిగితే చాలు.. రాజకీయంగా సుదీర్ఘకాలంపాటూ స్థిరమైన ఆదరణ ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఎన్నడో లెక్కలు వేసింది. అందుకే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఘనమైన హామీని కూడా ప్రకటించింది. అయితే సహజంగానే ఎన్నికల తర్వాత చంద్రబాబు దీన్ని గురించి మరచిపోయారు. 
ఈలోగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమ సొంత బలాన్ని నిర్మించుకోవాలని కలగంటున్న భాజపా కాపులను దువ్వడం ప్రారంభించింది. ఈసారి పార్టీ రాష్ట్రశాఖకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తే గనుక.. కాపులకే ఇవ్వాలని కూడా వారు అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందే మేలుకుంటే.. కాపుల్లో మంచి పేరు సంపాదించుకోవచ్చని, కాపు నాయకులంతా.. ఇతర పార్టీలకు దగ్గరయ్యేలోగా అర్జంటుగా ఈ బీసీ నిర్ణయాన్ని బయటకు తేవాలని ప్లాన్‌ చేసిన చంద్రబాబు.. ఆమేరకు కేబినెట్‌ ఎజెండాలో పెట్టించారు. 
సరిగ్గా ఈ సమయంలోనే .. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఉన్న సమయంలో- కాపునేత వంగవీటి మోహన రంగా దారుణ హత్యకు గురికావడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే వార్తలు వెలుగుచూశాయి. ఇది కాస్త చికాకు పెడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాపులను బీసీలు చేసినా సరే.. చంద్రబాబు మీద వారందరిలోనూ అనుమానాలు ఉంటాయని.. ఆయనను ఒక పట్టాన నమ్మలేకపోవచ్చునని పార్టీ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment