తాజా వార్తలు

Saturday, 7 November 2015

మొదలైన బీహార్ ఎన్నికల కౌంటింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.  మహాకూటమి ముందజలో ఉంది. ఎన్డీఏకూటమి రెండో స్థానంలో ఉంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితమే ప్రారంభమయ్యింది. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో 14,580 మంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. 38 జిల్లాలో 39 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో 3,450 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment