తాజా వార్తలు

Friday, 20 November 2015

ధోని కథలో భూమిక

సినిమాల్లో రీఎంట్రీకి భూమిక రంగం సిద్ధం చేసుకుంటుందట. క్రికెటర్ మహేంద్రసింగ్‌ధోనీ జీవిత కథతో హిందీలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమిక ఓ కీలక పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సరికొత్త కోణంలో ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. చిత్ర కథను మలుపుతిప్పేలా భూమిక పాత్ర ఉంటుందని సమాచారం. గత ఏడాది లడ్డుబాబుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సుందరి. ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment