తాజా వార్తలు

Monday, 2 November 2015

వరంగల్ ఎంపీకి సెంట్రల్ మినిస్టర్ షురూ ...!వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిని నిలపడంలో నెమ్మదిగా కదిలిన భారతీయ జనతా పార్టీ... హామీల విషయంలో మాత్రం వేగంగా స్పందిస్తోంది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ ఆసక్తికరమైన ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏకంగా కేంద్ర మంత్రి పదవి హామీని ఎర గా వేస్తోంది భారతీయ జనతా పార్టీ. వరంగల్ లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవిని ఇస్తామనే హామీని తెరపైకి తెస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. 
వరంగల్ ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఉంటే ఆ ప్రాంతం బాగా అభివృద్ది చెందుతుంది.. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిపించాలనేది ఆ పార్టీ నేతల వాదన. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామే కాబట్టి.. కేంద్ర మంత్రి పదవి ఇవ్వగలమని.. కాబట్టి తమ అభ్యర్థిని గెలిపిస్తే.. వరంగల్ కు ఎంపీనే గాక, కేంద్ర మంత్రి ని కూడా తెచ్చుకోవచ్చనేది భారతీయ జనతా పార్టీ నేతల వాదన. ఇప్పటికే టెలివిజన్ చర్చా కార్యక్రమాల్లో కమలం పార్టీ నేతలు ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు. 
ఇలా కేంద్ర మంత్రి పదవిని ఎరగా వేసి లబ్ధి పొందుదామనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అధికారం తమ చేతిలో ఉంది కాబట్టి ఇలాంటి వ్యూహాలకు బీజేపీకి అవకాశం ఏర్పడుతోంది. మరి భారతీయ జనతా పార్టీ ఇస్తున్న ఈ తరహా హామీ వరంగల్ లో చెల్లుబాటు అవుతుందా... అనామకుడిని తీసుకొచ్చి నిలబెట్టి... ఆయనను గెలిపిస్తే కేంద్రమంత్రి పదవి ఇస్తామని కమలనాథులు అంటే... జనాలు నమ్ముతారా.. ఇది విజయవంతమైన వ్యూహం అవుతుంది? వేచి చూడాలి! 
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment