తాజా వార్తలు

Thursday, 12 November 2015

హేజల్ తో యువీ ఎంగేజ్ మెంట్...!

బ్రిటీష్ మోడల్‌ను యువరాజ్ సింగ్ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ సినిమాలో 28 ఏళ్ల హేజల్ కూడా నటించింది. ఇటీవల హర్భజన్ రిసెప్షన్‌కు హేజల్‌తో హాజరైన యువీ తన తోటి మిత్రుల సలహాలను ఫాలో అవుతున్నాడు. ఇండోనేషియాలోని బాలీలో దీపావళి రోజున  ఎంగేజ్ మెంట్ జరిగిందని టాక్. దీపావళి నుంచి స్ట్రెయిట్ డ్రైవ్ ఆడుతానని ఇటీవల హర్భజన్‌కు ట్వీట్ చేసిన యువీ అన్నట్టుగానే బ్రిటీష్ మోడల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో హేజల్‌ను యువీ పెళ్లి చేసుకుంటాడని వార్తలు కూడా వస్తున్నాయి. యువీ ఛాయిస్ పట్ల తండ్రి యోగ్‌రాజ్ కూడా ఆనందం వ్యక్తం చేశారని మరో టాక్..  కాగా..హేజల్‌తో యువీకి మూడేళ్ల నుంచి పరిచయం ఉంది. కానీ గత రెండు నెలల నుంచి మాత్రమే ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తున్నట్లు క్రికెటర్ తల్లి షబ్నం సింగ్ చెప్పారు.

« PREV
NEXT »

No comments

Post a Comment