తాజా వార్తలు

Friday, 27 November 2015

గాయపడ్డ బిపాసా బసు

సినీ నటులు షూటింగ్ సమయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వారికి ఒక్కోసారి ప్రమాదకర పరిస్తితులే ఎదురవుతాయి.పాత్ర కోసం పరితపించే ఈ నటీ నటులు ఒక్కోసారి ప్రాణాలను కూడా రిస్క్ చేసి అద్బుతమైన సాహసాలు చేస్తుంటారు.అయితే ఓ బాలీవుడ్ బ్యూటీ మాత్రం మేకప్ విషయంలో గాయపడి అందరూ ఆశ్యర్యపోయేలా చేసింది.

బిపాసా బసు డర్ సబ్ కో లగ్ తా హై అనే హరర్ టీవీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోండగా , ఈ అమ్మడు తన మేకప్ విషయంలో గాయపడాల్సి వచ్చింది.తన హెయిర్ సెట్ చేసేందుకు బిపాసా ఓ హెయిర్ ైస్టెలిస్ట్ ను పిలిపించుకోగా ,ఆమె బిపాసా శరీరాన్ని గాయపరిచింది.కొత్త ైస్టెల్ కోసం ప్రయత్నించిన ఆ హెయిర్ ైస్టెలిస్ట్ బిపాసా ముఖం ,కుడి చెయ్యి కాలేలా చేసింది.ఇంత చేసి ఏమీ ఎరగనట్టు చూస్తుండే సరికి బిపాసా ఆమెపై ఫుల్ సీరియస్ అయిందట.
హెయిర్ విషయంలో జరిగిన ఈ విషయాన్ని బిపాసా తన ట్విట్టర్ లో పేర్కొంది.ఇలా జరిగిన తన కార్యక్రమాన్ని తాను తప్పక కొనసాగిస్తానంటూ ఈ అమ్మడు తెలిపింది.అయితే ఈ కార్యక్రమం గత అక్టోబర్ 31 నుండి ప్రసారం అవుతూ వస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment