తాజా వార్తలు

Saturday, 28 November 2015

పాసివాడి ప్రాణం తీసిన బోరుబావి

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుందిబోరుబావిలో పడ్డ చిన్నారి బాలుడు రాకేశ్ ఊపిరాడక మృతిచెందాడు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో బాలుడు నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ విషయం తెలిసిందే. ఇదే గ్రామానికి చెందిన రైతుకూలీ బైరు సాయిలు, మొగులమ్మ దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకడు రాకేశ్(3). అన్న బాలేష్(5)తో కలిసి బోరుబావిని తవ్వగా వచ్చిన రాతిపిండితో ఆడుకున్నాడు. అక్కడ తవ్వి ఉన్న బోరు గుంతలోకి తొంగిచూశాడు. ప్రమాదవశాత్తు అమాంతం అందులోకి జారిపోయాడు. తమ్ముడిని పట్టుకునేందుకు పక్కనే ఉన్న అతడి అన్న బాలేశ్ ప్రయత్నించాడు. తమ్ముడి కాలు పట్టుకుని లాగబోయాడు. కానీ అదుపు తప్పడంతో రాకేశ్ తలకిందులుగా లోనికి పడిపోయాడు. వెంటనే బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. కాసేపట్లోనే విషయం అధికారుల దాకా చేరింది. మెదక్ ఆర్డీవో నేతృత్వంలో బోరుబావిలోకి ఆక్సిజన్ను పంపిస్తూ జేసీబీలతో సహాయక చర్యలను చేపట్టారుపుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెంలో నిన్న బోరుబావిలో పడ్డ చిన్నారి రాకేశ్ మరణించాడు. సుమారు 24 గంటల పాటు శ్రమించిన అధికారులు రాకేశ్ను మృత్యువు నుంచి కాపాడలేక పోయారు. తెల్లవారు జామున 6.40 గంటల సమయంలో చిన్నారి మృతదేహన్ని బయటకు తీశారు.మృతదేహన్ని పోస్ట్‌‌మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాకేశ్ మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అటు తమ చిన్నారి ప్రాణాలతో తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment