తాజా వార్తలు

Friday, 20 November 2015

పేద విద్యార్థులకు ఉచిత విద్య

ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్ధులకు  ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నారా బ్రాహ్మణి ప్రకటించారు.  పేద విద్యార్ధులకు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన చదువు అందించటమే తమ లక్ష్యమన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌  ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్కిల్‌ డెవలప్‌మెంట్  పనితీరును వివరించిన  బ్రాహ్మణి..గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. అలాగే 2005లో ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూళ్లను ప్రారంభించి ఈ పదేళ్లలో వేల మంది విద్యార్ధులను విద్యాబోధన చేశామని.. కృష్ణా, వరంగల్‌ జిల్లాల్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్ స్కూళ్లు ప్రారంభించబోతున్నామని వివరించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment