తాజా వార్తలు

Friday, 27 November 2015

మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు: ఆ గొంతు రేవంత్ రెడ్డిదే!

ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి,సండ్ర వెంకటవీరయ్య, మరో నిందితుడు మత్తయ్యల స్వర పరీక్షలకు సంబందించిన నివేదికలను పోరెన్సిక్ ప్రయోగ శాల నిర్దారించిందని కదనం వచ్చింది.ఈ కేసులోని వీడియో టేపులు వాస్తవమైనవేనని దృవీకరించిందని చెబుతున్నారు.ఈ కేసులో ప్రస్తావనకు వచ్చిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వరపరీక్ష జరగవలసి ఉందని, ఆయన స్వర నమూనా సేకరించనున్నామని ఎసిబి అధికారి ఒకరు చెప్పినట్లు మీడియా లో వార్త వచ్చింది. అనుబంద చార్జీసీట్ వేయడానికి ముందే చంద్రబాబు స్వర శాంపిల్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపినట్లు ఆ కధనం చెబుతోంది.నిజంగానే ఈ కేసు ను సీరియస్ గానే ముందుకు తీసుకువెళుతున్నారా?ఈ మద్య జరిగిన పరిణామాల నేపద్యంలో సహజంగానే ఈ సందేహం వస్తుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment