తాజా వార్తలు

Sunday, 29 November 2015

చంద్రబాబుకు కండిషనల్ బెయలా!

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కండిషనల్ బెయిల్ పై ఉన్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అందువల్లనే చంద్రబాబు నాయుడు 83 రోజులు హైదరాబాద్ బయట ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ షరతులకు తలొగ్గి ఆయన హైదరాబాద్ లో లేకుండా వెళ్లారని , కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మద్యవర్తిత్వం చేశారని అంబటి ఆరోపించారు.ఓటుకు నోట్లు కేసులో నుంచి బయటపడడానికే చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన అన్నారు.హైదరాబాద్ లోనే ఉండడానికి సుమారు వంద కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకున్న చంద్రబాబు ఇన్నాళ్లు హైదరాబాద్ లో ఎందుకు ఉండకుండా వెళ్లిపోయారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.చంద్రబాబుకు జగన్ ను విమర్శించే అర్హత ఎక్కడిదని రాంబాబు ప్రశ్నించారు.కెసిఆర్ అనుమతితోనే చంద్రబాబుకు సచివాలయానికి వచ్చారని ఆయన అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment