తాజా వార్తలు

Tuesday, 17 November 2015

లిఫ్ట్ లో ఇరుక్కుని చిన్నారి మృతి

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జెహాన అక్కడికక్కడే చనిపోయింది. మంగళవారం ఉదయం స్కూల్ కు వెళ్లిన జెహాన .. తోటి విద్యార్థులతో కలసి పైఅంతస్తులోని తరగతి గదికి లిఫ్ట్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్ గ్యాప్ లో ఇరుక్కోవడంతో జెహాన విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి శరీరం లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.  ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లిన పాప అంతలోనే మరణించిదన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment