తాజా వార్తలు

Tuesday, 24 November 2015

తొమ్మిదేళ్ల బాలికపై ఉపాద్యాయుల అత్యాచారం

మహారాష్ట్ర భయందర్లో దారుణం జరిగింది. ముగ్గురు ఉపాధ్యాయులు తొమ్మిదేళ్ల బాలికపై  ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంజయ్పాటిల్‌(47), నీలేష్బోయిర్‌(47), జితేంద్ర జాదవ్‌(23) అనే ముగ్గురు ఉపాధ్యాయులు తమ వద్ద చదువుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై ఏడాది కాలంగా పలు మార్లు అత్యాచారం జరుపుతున్నారు. ఎవరికైనా చెబితే కొడతామంటూ బెదిరిస్తున్నారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు ఉపాధ్యాయులపై క్రిమినల్కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిపై అమానుషానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని మహిళా, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment