తాజా వార్తలు

Saturday, 7 November 2015

సిల్లీగా దొరికపోయిన చోటా రాజన్

ఇండోనేషియాలోని బాలి ఎయిర్‌ పోర్ట్ లో తన నిజమైన పేరు చెప్పటమే చోటా రాజన్‌ కొంప కొల్లేరు చేసిందట. పాస్‌ పోర్ట్ లో ఓ పేరు ఉండగా.. తాను మాత్రం అసలు పేరు చెప్పాడు. దీంతో అక్కడి పోలీసులకు అనుమానం వచ్చింది. మనోడు పుట్టు పూర్వోత్తరాలను ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు. వేలి ముద్రలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా అధికారులు భారత అధికారులను సంప్రదించారు. చోటా రాజన్‌..అసలు స్టోరీ తెసుకున్నారు. ఇంకేముంది వెంటనే అరెస్ట్ చేశారు. భారత అధికారుల విజ్ఞప్తి మేరకు చోటా రాజన్ ను భారత పోలీసులకు అప్పగించారు. అలా చోటా రాజన్ కథ ముగిసింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment