తాజా వార్తలు

Monday, 2 November 2015

పోలీసులకు దావూద్ తో సంబంధాలుపట్టుబడింది ఒక నేరగాడు అయినా... ఇప్పుడు కొంత మంది పొలిటీషియన్ల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్ర, ముంబై రాజకీయ నేతలకు రాజన్ భయం పట్టుకుంది. బాలి దీవి నుంచి రాజన్ ను తీసుకురావడానికి సీబీఐ వాళ్లు సిద్ధం అయ్యారు. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లో రాజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక కేసుల విషయంలో రాజన్ ను ప్రశ్నించడానికి ప్రశ్నావళి కూడా సిద్ధం అయ్యింది. డజన్ల కొద్దీ హత్య కేసులున్నాయి రాజన్ మీద. అంతే కాదు.. దావుద్ గ్యాంగ్ గురించి చాలా సమాచారమే లభించే అవకాశం ఉంది రాజన్ దగ్గర నుంచి. ముంబై వరస పేలుళ్ల కేసు విషయమై కూడా రాజన్ ను ప్రశ్నించవచ్చు. దావుద్ నెట్ వర్క్ గురించి రాజన్ దగ్గర బోలెండంత ఇన్పర్మేషన్ ఉండే అవకాశాలున్నాయి. 
ఇదే ఇప్పుడు కొంతమంది రాజకీయ నేతలకు, వ్యాపారవేత్తలకు  తలనొప్పిగా మారుతోంది. మహారాష్ట్రకు చెందిన కొంతమంది రాజకీయ నేతల కు దావూద్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. దావూద్ పట్టుబడతానని చెప్పినా.. ఆ రాజకీయ నేతలు  అడ్డుపడ్డారని, అతడి పట్టుబడితే తమ చీకటి చరిత్ర కూడా బయటకు వస్తుందనే భయం ఆ నేతలకు ఉందనేది ఆరోపణ. ఈ అంశం గురించి ఇటీవల కూడా చర్చ జరిగింది. దావూద్ లొంగిపోతానని వర్తమానం అందిస్తే.. అప్పట్లో సీబీఐ పట్టించుకోలేదని, ఈ విషయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు కూడా ప్రమేయం ఉందని, దావూద్ పట్టుబడటం ఆయనకు ఇష్టం లేకపోయిందని కొంతమంది ఆరోపణలు చేశారు. 
మరి ఇప్పుడు దావూద్ ఆపోజిట్ గ్యాంగ్ సభ్యుడు అయిన రాజన్ పట్టుబడటం రాజకీయ వర్గాలను కూడా ఇబ్బంది పెట్టే అంశమే. ఇప్పటికే రాజన్ ఆసక్తికరమైన ఆరోపణలు చేశాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్ తో సంబంధాలున్నాయని రాజన్ మీడియాతో వ్యాఖ్యానించాడు. మరి రాజకీయ నేతలకు కూడా సంబంధాలున్నాయా.. దావూద్ తో భారత రాజకీయ నేతలు సఖ్యతతో ఉన్నారా? అంటే మాత్రం "నో కామెంట్'' అంటూ సమాధానాన్ని దాట వేశాడు. 
మరి రాజన్ ఒక కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడా? ఇతడు పట్టుబడటంతో ముంబై చీకటి సామ్రాజ్యంతో రాజకీయ నేతల అనుబంధం.. దావూద్ తోవారి సాంగత్యం గురించి అసలు నిజాలు వెలుగులోకి వస్తాయా? అనేవి సందేహాలు. అయితే రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే.. రాజన్ నిజాలు చెప్పినా.. అవి రాజకీయ పార్టీల నేతలను కటకటాల వెనుక్కు పంపేంత స్థాయి వరకూ వెళ్లే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. 
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment