తాజా వార్తలు

Monday, 9 November 2015

స్వచ్ఛ హైదరాబాద్ లో మరో ముందడుగు

హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్‌ను సుందర నగరంగా తయారు చేయడంలో భాగంగా ఇవాళ చెత్త బుట్టలు, చెత్తను తీసుకెళ్లే వాహనాలను సీఎం చేతుల మీదుగా జీహెచ్‌ఎంసీ పంపిణీ చేసింది.  నగరాన్ని మేటి నగరంగా తయారు చేసేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా చెత్త సేకరణకు ఆటో ట్రాలీలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. చెత్త బుట్టల పంపిణీ కూడా చేశారు సీఎం.శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను సమైక్య పాలకులు నాశనం చేశారు. హైదరాబాద్ కష్టాలు.. నష్టాలే.. ఇక ఇప్పుడైనా హైదరాబాద్‌ను బాగు చేసుకోవాలి. ఓ మంచి కార్యక్రమానికి ఇవాళ అడుగు పడింది. గత పాలకుల తీరుతెన్నులు బాధ కలిగించేవి. హైదరాబాద్‌లో వాన పడితే కార్లన్ని.. బోట్లు అవుతాయి. పరిశుభ్రత విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయాలని నగరంలోని అన్ని పార్టీల నేతలతో చర్చించాం. ఆ తర్వాత ఆటో ట్రాలీలు, చెత్త బుట్టల పంపిణీనికి నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ 1005 ఆటో ట్రాలీలు.. చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో 42 లక్షల చెత్త బుట్టలు అవసరం. నవంబర్ నెలఖారు వరకు చెత్తబుట్టలు పంపిణీ చేస్తాం.  పరిశుభ్రతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. హైదరాబాద్ మహానగరంలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం రెండు రకాల చెత్త బుట్టలను ఆవిష్కరించింది. పొడి చెత్త, తడి చెత్త సేకరణ కోసం నీలి రంగు, ఆకు పచ్చ రంగు బుట్టలను సీఎం కేసీఆర్ పంపిణీ చేశారు. చెత్త మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం చేసిన తర్వాత ఈ రెండు రకాల చెత్త బుట్టలను రూపొందించినట్లు సీఎం తెలిపారు.   
« PREV
NEXT »

No comments

Post a Comment