తాజా వార్తలు

Friday, 27 November 2015

హీరోగా కూడా రెడీ

ఇన్నాళ్ళు తన సంగీతంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టించిన దేవిశ్రీ ప్రస్తుతం తనలోని మరో కోణాన్ని పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు. మంచి మాస్ మ్యూజిక్ తో యూత్ కు కిక్ ఎక్కించే ఈ రాక్ స్టార్ స్టేజీ ఫంక్షన్ లో తన గోంతుతోనే కాక స్టెప్పులతోను అభిమానులకు పసందైన వినోదాన్ని అందిస్తున్నాడు .

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుమారి 21 ఎఫ్ చిత్రం మంచి సక్సెస్ ను అందుకోగా,త్వరలో విడుదల కాబోతున్న నాన్నకు ప్రేమతో,సర్ధార్ చిత్రాలకు కూడా డి.ఎస్ .పి తన స్వరాలను అందిస్తున్నాడు.అయితే దేవి త్వరలో హీరోగా కూడా కనిపించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.అయితే ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనుండగా సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు.ఇక సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు పని చేయనున్నారు.ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవినే తన చిత్రానికి సంగీతం అందించనున్నట్టు తెలుస్తోంది.

మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే ఈ రాకింగ్ స్టార్,హీరోగా ఎలా అలరిస్తాడో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు మరి.
« PREV
NEXT »

No comments

Post a Comment