తాజా వార్తలు

Monday, 30 November 2015

ఎమ్మెల్సీ ఎన్నికల పొత్తుకు టీఆర్ ఎస్ రెడీయా..!డీకే అరుణ

పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ తో పొత్తుకు మేము సిద్ధమని డీకే అరుణ ప్రకటించారు. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని..టీడీపీబీజేపీ కూటమికి ఒక్క సీటు గెలుచుకునే బలం లేదని ఎద్దేవా చేశారుమహబూబ్నగర్ జిల్లాలో రెండు స్ధానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయిటీఆర్ఎస్కాంగ్రెస్ చెరో సీటు గెలిచేందుకు సహకరిస్తే ఆహ్వానిస్తామని డీకే అరుణ అన్నారుతెలంగాణలో హైదరాబాద్‌ మినహా 9 జిల్లాల్లో మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు డిసెంబర్ 27 పోలింగ్‌, 30 తేదీన కౌంటింగ్‌ జరుగుతుందిఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో, టీఆర్ఎస్ ఏకగ్రీవ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఆహ్వానిస్తామని గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తెలిపారు. దీనిపై టీఆరెస్ వెర్షన్ ఏంటో తెలియాల్సి ఉంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment