తాజా వార్తలు

Saturday, 21 November 2015

గతంలో చిరు, బాలయ్య, మహేష్... ఇపుడు అఖిల్

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన అఖిల్ హీరోగా పరిచయం అవుతున్నాడనే విషయం వినగానే అక్కినేని అభిమానులు సంబర పడ్డాడు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండటంతో మరింత హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ‘అఖిల్' అనే టైటిల్ ఖారారైన తర్వాత అంతా డీలా పడ్డారు. హీరో సొంత పేరు సినిమా టైటిల్ లో ఉండటమే అందుకు కారణం.

 గతంలో చిరంజీవి, మహేష్ బాబు, బాలయ్య, నాగార్జున, కళ్యాణ్ రామ్ లాంటి వారిని ఇదే సెంటిమెంటు దెబ్బకొట్టింది. చిరంజీవీ హీరోగా వచ్చిన ‘చిరంజీవి', నాగార్జున హీరోగా వచ్చిన ‘కెప్టెన్ నాగార్జున', మహేష్ బాబు నటించిన ‘మహేష్ ఖలేజా', కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘కళ్యాణ్ రామ్ కత్తి', బాలయ్య నటించిన ‘ఎన్.బి.కె లయన్' లాంటి చిత్రాలు గతంలో బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి.

పెద్ద పెద్ద స్టార్లను సైతం ఇలాంటి సెంటిమెంటు దెబ్బకొట్టినా.....ఇటు నాగార్జునగానీ, అటు వివి వినాయక్ గానీ, చివరకు నిర్మాతగా డబ్బులు ఖర్చు పెట్టిన నితిన్ గానీ పట్టించుకోలేదు. సెంటిమెంట్ లేదే ఏమీ లేదంటూ లైట్ తీసుకున్నారు. కానీ చివరకు అభిమానులు భయ పడ్డదే జరిగింది. అఖిల్ ను టైటిల్ సెంటిమెంట్ దెబ్బకొట్టింది. అంతా అయిపోయాక ఇపుడు బాధపడి ఏం లాభం!
« PREV
NEXT »

No comments

Post a Comment