తాజా వార్తలు

Sunday, 29 November 2015

రామార్పణం-చంద్రార్పణం-బిజెపి లో చర్చ

ఎపి బిజెపి నేతల పరిస్థితి భలే ఇబ్బందిగా మారింది.కేంద్రం నుంచి వచ్చే పదకాలను తెలుగుదేశం నేతలు తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని బిజెపి ఎపి నేతల సమావేశంలో చర్చ చేశారట.కేంద్రం ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఎపికి ఇస్తే బిజెపి నేతలు సిఫారస్ చేసినవారికి గాని, బిజెపిలో అర్హులైనవారికి కాని నియోజకవర్గానికి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని నెల్లూరు,కడప బిజెపి నేతలు కొందరు వాపోయారు.విద్యుత్ లో ఆదా చేసే ఎల్ ఇడి బల్బులు పెద్ద ఎత్తున తక్కువ దరకు ఇచ్చిన అవి టిడిపి క్రెడిట్ కిందే చెబుతున్నారని వారు బాదపడ్డారు. అప్పుడు బిజెపి అద్యక్షుడు హరిబాబు తాజాగా కేంద్రం 1.93 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, వాటిని రామార్పణం కాకుండా చూడాలని అంటే, మీరు చంద్రార్పణం చేయకండి అని మరో నేత వ్యంగ్యం గా అన్నారు. బిజెపిలో కొందరు నేతలు చంద్రబాబు ను ఎక్కువగా పొగుడుతున్నారన్న అబిప్రాయం నేపద్యంలో ఆయన ఈ వ్యంగ్య వ్యాఖ్య చేశారన్నమాట.
« PREV
NEXT »

No comments

Post a Comment