తాజా వార్తలు

Monday, 30 November 2015

గ్రీన్ టీతో కాస్త జాగ్రత్త..

మోతాదుకు మించి ఏది తిన్నా, తాగిన విషమే..గ్రీన్ టీ కూడా దానికి అతీతం కాదు. గ్రీన్ టీని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అదే మోతాదుకు మించితే, మనస్సు మీద దుష్ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీయాక్సిడెంట్స్ హార్మోనులను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి. అందువల్ల రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగరాదు. గ్రీన్ టీలో కెఫిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. కెఫిన్ తక్కువగా తీసుకుంటే, శరీరానికి కొన్ని ప్రయోజనాలుంటాయి. కెఫిన్ ఎక్కువైతే శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్స్ పని చేయడం కష్టమవుతుంది. గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ ఉదరంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఎక్కువ హాని కలిగించకపోయినా, ఉదర సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో న్యూట్రిషియన్స్ షోషణ గ్రీన్ టీ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ ఇది. ఇందులో ఉండే టానిన్ రక్తంలో షోషింపబడే కొన్ని న్యూట్రిషియన్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇలా అనేక దుష్ప్రభావాలు ఉన్నట్టు సమాచారం. గ్రీన్ టీతో కాస్త జాగ్రత్తగా ఉండండి సుమీ..

« PREV
NEXT »

No comments

Post a Comment