తాజా వార్తలు

Monday, 16 November 2015

అనుకున్నది సాధించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్... పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కలను సాకారమైంది. ఇవాళ ఐడీహెచ్ కాలనీలో పేదల కోసం నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను సీఎం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం పోయిన దసరాకు ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని నేటి వరకు పూర్తి చేసుకున్నాం. ఇవాళ మీరంతా కొత్త ఇండ్లలోకి పోతుండటంతో నాకెంతో సంతోషంగా ఉంది. అన్న మాట ప్రకారం పాలు పొంగించి నేనే మిమ్మల్ని ఇండ్లలోకి పంపిస్తున్నాను. అనుకున్న పద్ధతిలో ఇండ్లను నిర్మించుకున్నాం. దేశ చరిత్రలోనే కొత్త అంకానికి తెరతీశాం. 396 పేద కటుంబాలు సర్వ హంగులతో నిర్మించిన క్తొ ఇళ్లలో కాలు మోపాయి. సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను లబ్దిదారులు అందుకున్నారు. 60 ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వమూ చేయని పని తెలంగాణ ప్రభుత్వం చేసిందని సీఎం అన్నారు. దేశానికే మన ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇళ్లను ప్రారంభించిన అనంతరం కాలనీ ప్రజలతో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి బోజనం చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment