తాజా వార్తలు

Sunday, 15 November 2015

సూర్యప్రకాశ్‌ అఖండ మెజారిటీతో గెలిపించండి- జగన్

వరంగల్   ఉప ఎన్నికలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ వరంగల్ జిల్లా పాలకుర్తి చేరుకున్నారు. పాలకుర్తిలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తరలివచ్చి వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. పాలకుర్తిలో వైఎస్ జగన్ రోడ్డు షో నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. వైఎస్ జగన్ వెంట తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ తరపున వైఎస్ జగన్ ప్రచారం చేస్తున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment