Writen by
vaartha visheshalu
06:00
-
0
Comments
ఢిల్లీ అసెంబ్లీలో జర్నలిస్టుల సంక్షేమ బిల్లును కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టింది. జర్నలిస్టులకు కనీస వేతనం రూ.25000, నాన్-జర్నలిస్టులకు కనీస వేతనం రూ.17,500గా ఉండాలని బిల్లులో పేర్కొంది. మాజీత్యా కమిటీ సిఫార్సులను కచ్చితంగా అమలు చేసేలా నిబంధనలు రూపొందించాలని బిల్లులో ప్రభుత్వం తెలిపింది. చాలా మీడియా సంస్థల మేనేజ్మెంట్లు ఈ సిఫార్సులను అమలు చేయకపోవడంతో చట్ట రూపం తీసుకురావాల్సి వచ్చిందని ఢిల్లీ సర్కారు తెలిపింది. సంస్థల ఆదాయాన్ని బట్టి 8 విభాగాలుగా మీడియా సంస్థల వర్గీకరణ, న్యూస్ ఏజెన్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. జర్నలిస్టుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలుగా నిర్ణయించారు.
No comments
Post a Comment