తాజా వార్తలు

Tuesday, 17 November 2015

రణబీర్ ను అవమానించడం ఇష్టం లేక..

సల్మాన్ తో విడిపోయిన విషయం తెలిస్తే..రణ్ బీర్ ఫీలవుతాడని హాట్ బ్యూటీ కత్రినా తేల్చేసింది.వివరాల్లోకి వెళితే..
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్  విషయం గురించి ప్రస్తావిస్తే.. సమాధానం చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఫీలైందట కత్రినా కైఫ్. అసలు విషయం చెప్పకుండా తెలివిగా తప్పుకుందట. “నేను సల్మాన్ కలిసి ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాం. విడిపోయిన తరువాత కూడా మేం అలాగే ఉన్నాం. అసలు మేమిద్దరం ఎందుకు విడిపోయామో చెబితే.. అది నా ప్రస్తుత బాయ్ ఫ్రెండ్‌ను అవమానించినట్టు అవుతుంది. సల్మాన్ ఫ్యామిలీ గురించి నేనిప్పుడు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. లెట్స్ లీవ్ ఇట్” అంటూ ఆ టాపిక్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసిందట బాలీవుడ్ క్రేజీ హీరోయిన్. దీంతో ఈ విషయం గురించి బాలీవుడ్ వర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి. రణ్ బీర్‌కు ఇబ్బంది కలిగించకూడదనే కత్రినా ఇలా మాట్లాడిందని కొందరంటుంటే.. అసలు విషయం చెబితే ఇంకెన్ని కొత్త తలనొప్పులు వస్తాయో అనే ఫీలింగ్ తోనే అసలు విషయాన్ని చెప్పలేదని ఇంకొందరు భావిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment