తాజా వార్తలు

Friday, 13 November 2015

సీఎం కేసీఆర్ ను అవమానించిన ఆంధ్ర అధికారులు

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అమరావతి శంకుస్థాపన ఛాయాచిత్రాల ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో ఏర్పాటు చేశారు. కానీ శంకుస్థాపనకు హాజరైన కేసీఆర్ ముఖాన్ని మాత్రం గ్రాఫిక్స్‌లో ఉద్దేశపూర్వకంగా నల్లరంగుతో మాస్క్ వేసి స్పష్టంగా కనబడకుండా చేశారు. నాలుగు చిత్రాల్లోనూ కేసీఆర్ ముఖాన్ని స్పష్టంగా కనబడనీయకుండా మూసేశారు. కేసీఆర్‌కు పక్కన ఉన్న చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉండగా, వారి మధ్యలోనే ఉన్న కేసీఆర్ ముఖం మాత్రం నల్లగా గుర్తు పట్టడానికి వీల్లేకుండా చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment