తాజా వార్తలు

Wednesday, 4 November 2015

రాజయ్య కోడలు సారిక మరణానికి కారణాలేంటి?వెలుగుచూస్తున్న కొత్త కోణం!రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనుమలు అత్యం ఘోరంగా మరణించిన ఘటనకు సంబంధించి ఇప్పుడు కొత్త అనుమానాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నలుగురి దుర్మరణం ప్రమాదంగా తెల్లవారుజామున ప్రచారం జరిగింది. నిజానికి ప్రమాదం అయ్యే అవకాశం లేదని, ఆత్మహత్య కావచ్చునని అంతా అనుకున్నారు. తాజాగా ఈ నలుగురి దుర్మరణాలలో హత్యకోణం కూడా వెలుగు చూస్తున్నది. ఇది హత్య కావడానికి అనేక కారణాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. కోడలితో రాజయ్య కుటుంబానికి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వవద్దంటూ కూడా సారిక నాలుగురోజుల కిందట ఏఐసీసీ కి ఒక లేఖ రాసినట్లు తెలుస్తున్నది. తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని, తనకు ద్రోహం చేసిన రాజయ్యకు టికెట్‌ ఇవ్వవద్దని సారిక లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న అనేక పరిస్థితులను బట్టి.. ఇది హత్య అయి ఉండవచ్చుననే వాదనలు ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్నాయి. 
హత్యకోణం అనిపించేలాచేస్తున్న అనేక కారణాలు: 
-) తన మామ రాజయ్య మాధవి దంపతులు, భర్త అనిల్‌ తనను వేధిస్తున్నారని, హింసిస్తున్నారని, పిల్లలను కూడా వేధిస్తున్నారని సారిక గతంలో వారిపై గృహహింస కేసు పెట్టింది. కోర్టులో దావా వేసింది. ఆ వ్యవహారం అప్పట్లో ఆయన ఎంపీగా ఉన్నందున సంచలనం అయింది. 
-) ఆ నేపథ్యంలో ఆమెకు ప్రస్తుతం దుర్ఘటన జరిగిన ఇల్లు ఇచ్చి అందులో ఉండాల్సిందిగా రాజయ్య కుటుంబం చెప్పింది. అప్పటినుంచి సారిక తన ముగ్గురు పిల్లల్తో కలిసి అదే ఇంట్లో నే ఉంటోంది. 
-) ఆ ఇంటికి సారిక భర్త అనిల్‌ గానీ, అత్తమామలు గానీ ఎన్నడూ వచ్చే వాళ్లు కాదు. మరణాలు జరిగిన రోజు ముందు మాత్రమే.. రాజయ్య దంపతులు అక్కడకు వచ్చారు. 
-) రాజయ్య కోడలు సారిక నాలుగు రోజుల కిందట ఏఐసీసీకి ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాసింది. మామకు అభ్యర్థిత్వం ఇవ్వవద్దని అందులో పేర్కొన్నది. తనను వేధిస్తున్న మామకు రాజకీయ అవకాశం ఇవ్వవద్దని ఆమె లేఖలో రాసినట్లు సమాచారం. 
-) మంగళవారం రాత్రి పదిన్నర, పదకొండు గంటల సమయంలో మామా కోడళ్లు ఇద్దరూ ఇంట్లో పెద్దస్థాయిలో తగాదా పడ్డారు. వారు గొడవ పడుతున్నట్లుగా శబ్దాలు వినిపించాయని ఇరుగు పొరుగు వారు కూడా చెబుతూనే ఉన్నారు. అయితే చాలా సేపటి తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. 
-) ఎన్నికల్లో పోటీచేసినా.. తాను వదిలిపెట్టేది లేదని.. రాజయ్యకు వ్యతిరేకంగా మళ్లీ పోరాడతానని సారిక ఆయనతో గొడవ పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 
-) ఈ ఇంట్లో ప్రమాదం ఫస్ట్‌ఫ్లోర్‌లో జరిగితే.. తాము ఆ పైఫ్లోర్‌లో ఉన్న గదిలో నిద్రిస్తున్నామని రాజయ్య దంపతులు చెబుతున్నారు. 
-) ఫస్ట్‌ఫ్లోర్‌లోని బెడ్‌ రూంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే గ్యాస్‌సిలిండర్లను తెచ్చి బెడ్‌రూంలో ఎందుకు పెట్టారు? ఎవరు పెడతారు? అనేది ఒక ప్రధానమైన అనుమానంగా కూడా 
-) రాజయ్య ఎంపీగా ఉండగానే ఆయన మీద పోరాటానికి దిగిన సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికి మనస్తత్వం ఉన్నది కాదని పలువురు 
-) తన పిల్లలకు ముల్లు గుచ్చుకున్నా, చిన్న దెబ్బ తగిలినా సారిక భరించగలిగేది కాదని.. అలాంటిది ముగ్గురు పిల్లలను చంపేసి తను ఆత్మహత్య చేసుకున్నదంటే నమ్మలేకపోతున్నామని పలురు చెబుతున్నారు. 
-) మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి.. ఇది ఆత్మహత్య కాకపోవచ్చునని కూడా పలువురు అనుమానిస్తున్నారు. 
ఇన్ని కారణాల నేపథ్యంలో సారిక మరియు ముగ్గురు పిల్లల అడ్డు తొలగించుకోవడానికి ప్లాన్‌డ్‌ గానే హత్య చేయించి ఉంటారనే అనుమానాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే రాజయ్య మాత్రం తన కుటుంబంలో జరిగిన ఈ ఘోరం పట్ల భోరుబోరున విలపిస్తున్నారు. మరణాల గురించి తెలిసి పోలీసులు, స్థానికులు వచ్చే సమయానికే ఆయన కుప్పకూలిపోయి ఉన్నారు. 
హత్యకోణం అనేది అక్కడ ఉన్న ఆధారాలు, జరిగిన పరిణామాలను బట్టి కేవలం అనుమానమే కాగా, అసలు వాస్తవాలు ఏమిటి అనేది పోలీసులు విచారణలో తేలుస్తారని అంతా అనుకుంటున్నారు. 
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment