తాజా వార్తలు

Monday, 9 November 2015

అదరకొడుతున్న లోఫర్ ట్రైలర్'లోఫర్' సినిమాకు సంబంధించిన థియేటర్ ట్రైలర్ విడుదలైంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యూట్యూబ్ చానల్లో ప్రేక్షకులు ప్రస్తుతం ట్రైలర్‌ను వీక్షించవచ్చు. సి.కల్యాణ్ సమర్పణలో సీవీ రావు, శ్వేతలానా, వరుణ్, తేజలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిశా పటాని హీరోయిన్గా నటిస్తున్న సినిమాకు చెందిన షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఆదివారం చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సినీ వర్గాలు సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశాయి. ఫస్ట్‌లుక్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'లోఫర్' థియేటర్ ట్రైలర్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని సినీ నిర్మాతలు పేర్కొంటున్నారు. దీంట్లో హీరో వరుణ్ తేజ నూతనంగా కనిపించబోతున్నాడని, ఆయన చేస్తున్న తొలి మాస్ ఎంటర్టైనర్గా ఇది అందరినీ ఆకట్టుకుందని అన్నారు. మదర్ సెంటిమెంట్, హైరేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయని అన్నారు.  
 
'
లోఫర్' నటీ నటులు: రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, సంపూర్ణేష్ బాబు, సప్తగిరి, పవిత్రా లోకేష్, ఉత్తేజ్, భద్రమ్, శాండీ, ధన్‌రాజ్, టార్జాన్, చరణ్ దీప్, వంశీ, రమ్య
« PREV
NEXT »

No comments

Post a Comment