తాజా వార్తలు

Friday, 13 November 2015

లండన్ లో మోడీ

లండన్ పర్యటనలో భాగంగా వెంబ్లీ స్టేడియానికి చేరుకున్న ప్రధాని మోడీకి కామెరూన్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2ను కలుసుకున్నారు. వెంబ్లీ స్టేడియంలో భారత జాతీయ గీతలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ‘లండన్‌లో చలిగా ఉంటుందని విన్నా. మీ ఆత్మీయ స్వాగతం వల్ల స్వదేశంలో ఉన్న భావన కలిగింది.  12 ఏళ్లక్రితం సీఎం గా మీ ముందుకు వచ్చా. దేశ ప్రజలు ఇపుడు నాకు కొత్త బాధ్యత అప్పగించారు. మీ కలల్ని సాకారం చేసే సత్తా దేశానికుంది. ఇప్పటివరకు అకారణంగా పేదరికాన్ని పోషించారు. దేశంలో యువతకు కొదవ లేదు. ఇక నుంచి వెనుకబాటుతనమన్న ప్రశ్నే ఉండబోదు. బ్రిటన్ పార్లమెంట్ ఎదుట గాంధీజీ విగ్రహాన్ని చూసి గర్వపడని భారతీయుడుంటారా’ అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని స్పష్టం చేశారు. భారత్ లో రబీర్, రహీమ్ ల మాటలు అందరికీ ప్రేరణనిస్తాయన్నారు.త్వరలో భారత్ అభివృద్ధి ఫలాల వైపు దూసుకెళ్తుందన్నారు ప్రధాని మోడీ.
« PREV
NEXT »

No comments

Post a Comment