తాజా వార్తలు

Friday, 27 November 2015

పెళ్ళి పీటలెక్కనున్న దేవిశ్రీ

తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే దేవి శ్రీ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నాడనే వార్త ఆయన అభిమానులకు పట్టలేని సంతోషాన్ని ఇస్తుంది.ఇన్నాళ్ళు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న దేవి త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నాడనే వార్తలు రాగా ఆయన అభిమానులు ఆ అమ్మాయి ఎవరు అయి ఉంటుందా అని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు.అయితే దేవి ఇటీవల కుమారి 21 ఎఫ్ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది.

దేవి శ్రీ సంగీతానికి తెలుగులోనే కాదు పరాయి భాషా చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించగా,ఈయన మ్యూజిక్ ప్రేక్షకులను సంగీత సాగరంలో ఊయలలూగించేలా చేస్తోంది.అయితే దేవి శ్రీ ఇన్నాళ్ళు తన వర్క్ పైనే పూర్తి కాన్సన్‌ట్రేషన్ చేయగా,ప్రస్తుతం తను గాఢంగా ప్రేమించిన ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట.అయితే ఈ అమ్మాయి కొంత కాలం హీరోయిన్ గా అలరించి ప్రజెంట్ ఐటెమ్ సాంగ్స్ లో మెరుస్తున్నట్టు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది..

దేవి శ్రీ వివాహం విషయంపై ఆయన దగ్గర నుండి గాని లేదంటే ఆయన సన్నిహితుల దగ్గర నుండి ఎలాంటి సమాచారం లేదు.మరి ఈ వార్తపై పూర్తి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనేమో.
« PREV
NEXT »

No comments

Post a Comment