తాజా వార్తలు

Tuesday, 24 November 2015

మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్‌ చేస్తున్నారట..!

చీకటి రాజ్యం సినిమాలో కమల్‌ని ముద్దు పెట్టుకోవడం కథకు చాలా అవసరమని నటి మధుశాలిని చెప్పారు. నవంబర్‌ 20న విడుదలైన ఈ చిత్రానికి మీడియా ద్వారా చాలా పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ రావడం వల్ల సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. మధుశాలిని మాటల్లో.. ఈ సినిమాలో కమల్‌హాసన్‌గారితో ముద్దు సీన్‌లో నటించాను. సాధారణంగా ప్రతి సినిమాలో కిస్‌ అంటే అది ఒక రొమాంటిక్‌ సీన్‌లో చూపిస్తుంటారు. కానీ, ఈ సినిమాలో కమల్‌గారిని ముద్దు పెట్టుకోవడం అనేది కథకి అవసరం. ఆయన సినిమాల్లో ఏదైనా కథతోనే వెళ్తుంది. ఏ సీన్‌ అయినా కథలో వుండాలి కాబట్టే పెడతారు. సినిమా చూసిన వాళ్ళందరికీ కమల్‌గారితో ముద్దు సీన్‌ కన్విన్సింగ్‌గానే అనిపించింది. దీన్ని ఎవరూ పిన్‌పాయింట్‌ చేయలేదు. నేను నటించిన ఒక తెలుగు సినిమాలో నా క్యారెక్టర్‌కి ఇంత మంచి ఫీడ్‌ బ్యాక్‌ రావడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. కమల్‌హాసన్‌గారు చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఒక స్ట్రెయిట్‌ మూవీ చేశారు. తెలుగు ప్రేక్షకులు ఆయన్ని చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ రాజేష్‌గారు కమల్‌హాసన్‌గారితో ఏడు సంవత్సరాలు ట్రావెల్‌ చేశారు. డైరెక్టర్‌గా ఆయనకిది మొదటి సినిమా. ఈ సినిమాతో డైరెక్టర్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారు రాజేష్‌గారు. ఇలాంటి మంచి సినిమాలు ఆయన ఇంకా ఎన్నో చెయ్యాలి, నాకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలు అనేవి లేకపోయినా మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమా అంతా చాలా గ్రిప్పింగ్‌గా వుంది. మంచి సినిమా ఏదైనా మనం ఆదరిస్తాం. ఈ సినిమా ఒక డిఫరెంట్‌ జోనర్‌లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌.  
« PREV
NEXT »

No comments

Post a Comment