తాజా వార్తలు

Sunday, 29 November 2015

మహేష్ మాటలకు ఖంగుతిన్న ఫ్యాన్స్

శ్రీమంతుడు సినిమాతో మంచి సక్సెస్ ను సాధించిన మహేష్ తాజాగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఇందులో తన పర్సనల్ విషయాలే కాక
నమ్మకమైన భర్త ఎలా ఉండాలో కూడా మహేష్ వివరించారు.ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రంతో బిజీగా ఉన్న మహేష్ తన పర్సనల్ విషయాలను వెళ్ళడించడంతో ఆ విషయాలను తెలుసుకున్న ఫ్యాన్స్ మహేష్ రూట్ ని ఫాలో అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎందరో అభిమానులని సంపాదించుకున్న మహేష్ చాలా సింపుల్ గా ఉంటూ ఆయన అభిమానులకు ఎంతో స్పూర్తిగా నిలిచారు.అయితే ఇలా ఉండడానికి కారణం తన తండ్రి కృష్ణ నే అని మహేష్ పేర్కొన్నారు.అయితే తన 10 ఏళ్ళ వివాహ బంధంలో నమ్రతకు తాను మంచి భర్తలా ఉన్నానని తెలియజేస్తూ, ఎవరైతే భార్యలకు నమ్మకమైన భర్తలా ఉండరో వాళ్ళు ఫూలిష్ అంటూ మహేష్ ఇంగ్లీష్ పత్రికకు తెలియజేశాడు.అంతేకాదు తన మ్యారేజ్ లైఫ్ బ్యూటీఫుల్ గా ఉందని,గౌతమ్ ,సితార వచ్చాక ఇంకా బాగుందంటూ మహేష్ అన్నాడు.ఇక అన్నయ్య రమేష్ బాబు సిస్టర్ ఇందిరలతో చాలా ఆప్యాయంగా ఉంటానని మహేష్ పేర్కొన్నాడు.

మహేష్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న కూడా తన ఫ్యామిలీకు మరింత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు మహేష్ .ఇటీవలే తన ఫ్యామిలీతో ప్యారిస్ కు వెళ్ళిన మహేష్ హాలీడే ట్రిప్‌ను ముగించుకొని వచ్చి మళ్ళీ చిత్ర యూనిట్ తో కలిశారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా,సమంత,ప్రణీత,కాజల్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment