తాజా వార్తలు

Friday, 27 November 2015

ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్

తెలుగులో తమిళ సినిమాలు డబ్ అవడం,తెలుగు సినిమాలు హిందీకు వెళ్ళడం ప్రస్తుతం కామన్ గా మారింది.అయితే కొందరు తమిళ,మలయాళ స్టార్ లు తెలుగు సినిమాలలో కీలక పాత్రలు పోషించడం ఇక్కడి అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తోంది.గతంలో సుదీప్,మమ్ముట్టి లాంట్ స్టార్స్ తెలుగు సినిమాలలో ప్రత్యేక పాత్రలలో కనిపించగా ఇప్పుడో మలయాళ స్టార్ ఎన్టీఆర్ సినిమాలో కనిపించనున్నారు.

ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందని అప్పట్లో వార్తలు రాగా మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి.కాని ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రేక్షకులను ఆనందంలో తడిసేలా చేస్తోంది.అయితే తాజాగా ఎన్టీఆర్ కొరటాల సినిమా పట్టాలెక్కనుందని ఇందులో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్తలు వచ్చాయి.ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రం పూర్తిగా ఎన్టీఆర్ ైస్టెల్‌కు ఆయన ఇమేజ్ కు తగ్గట్టే ఉంటుందని దర్శకుడు కొరటాల తెలపారు.

ఎన్టీఆర్ తో పోటా పోటిగా మోహన్ లాల్ పాత్ర ఉంటుందని తెలిపిన దర్శకుడు ఈ చిత్రాన్ని 2016 సంవత్సరం మొదట్లో పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉండనుండగా త్వరలో వారి వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ చిత్రం వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాల సందర్బంగా ఆగస్టు 12 న విడుదల కానుందని నిర్మాతలు తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment