తాజా వార్తలు

Friday, 20 November 2015

మాలిలో తెగబడ్డ ఉగ్రమూక


పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఉగ్రవాదులు బరితెగించిపోతున్నరు. రాజధాని బమాకోలోని రాడిసన్బ్లూ హోటల్లోకి చొరబడి అక్కడివారిని బందీలుగా చేసుకున్నారు. హోటల్సిబ్బంది, బస చేసిన వారు మొత్తంగా 170 మందిని బందీలుగా చేసుకున్నారు. వీరిలో 9 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మృతుల్లో ఐదుగురు ఐరాస సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు హోటల్ఉన్న ప్రాంతానికి చేరుకుని ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మాలిలో ఘటనతో పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

« PREV
NEXT »

No comments

Post a Comment