తాజా వార్తలు

Tuesday, 17 November 2015

చిత్తూరు మేయర్ పై దాడి, మేయర్ మృతి

చిత్తూరు జిల్లాలో మరోసారి కాల్పుల మోత మ్రోగింది. ఇన్నిరోజులు ప్రశాంతంగా ఉన్న చిత్తూరు కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. చిత్తూరు జిల్లా మేయర్ కటారి అనురాధ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి అనంతరం కత్తితో పొడిచి చంపారు. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో మేయర్ అనురాధ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.  భర్త మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సహాయంతో మోహన్ ను ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూ లో మోహన్ కు చికిత్స అందిస్తున్నారు. 24గంటలు గడిస్తే కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి చెప్పడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. కర్ణాటక కు చెందిన కిరాయిగూండాలు కాల్పులు జరిపారని సమాచారం. అంతేకాకుండా వారు కర్నాటక పేరుతో వాహనం రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.ఈ దుర్ఘటన మున్సిపల్ కార్యాలయం నుంచి బయటికి వస్తుండగా ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు.  కాగా పాతకక్షలే ఇందుకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాల్పులకు పాల్పడ్డ అనంతరం కిరాయి దుండగులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. తీవ్ర వర్షాల గురించి మాట్లాడిన అనంతరం చంద్రబాబు..చిత్తూరు మేయర్ అనురాధ హత్య గురించి ప్రస్తావించారు. మహిళలను చంపిన ఘటనలు ఇంతవరకూ లేవు. వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. అనురాధ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. అనురాధపై దాడి చేయడం బాధాకరం. నీచ రాజకీయాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాము..రాజకీయ ముసుగులో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్ఠకరమని చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదు..వారిని కఠినంగా శిక్షిస్తామన్నరు చంద్రబాబు.   

« PREV
NEXT »

No comments

Post a Comment