తాజా వార్తలు

Sunday, 22 November 2015

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్

మలేషియాలో ప్రధాని నరేంద్ర మోడీపర్యటిస్తున్నరు. కౌలాలంపూర్‌లో భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత అభివృద్ధిలో తమిళ ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మలేషియా ప్రజలు తన పట్ల చూపే ఆప్యాయత మరువలేనిదని చెప్పారు. భారత సాంస్కృతిక కేంద్రానికి సుభాష్ చంద్రబోస్ పేరు పెడుతామన్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం అతి పెద్ద ముప్పుగా మారిందన్నారు. తీవ్రవాదాన్ని, మతాన్ని వేరు చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. ఉగ్రభూతంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క దేశం కూడా ఉగ్రవాదులకు మద్దతు ప్రకటించొద్దు అని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఉగ్రవాదాన్ని అంతమొందించొచ్చు అని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మీ పూర్వీకులు బోస్‌కు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఆజాద్ హిందు ఫౌజ్‌లో చేరి బోస్‌తో వెన్నంటి నడిచారని తెలిపారు. మలేషియాలోని భారతీయులు మహాత్ముడి నుంచి ఎంతో స్ఫూర్తి పొందారని చెప్పారు. ప్రపంచంలోని ప్రతి చోట భారతీయుల భాగస్వామ్యం ఉందన్నరు మోడీ. 
« PREV
NEXT »

No comments

Post a Comment