తాజా వార్తలు

Tuesday, 24 November 2015

భారత్ లో ప్రతీ ఒక్కరి ఆలోచనలో మార్పు వచ్చింది

సింగపూర్ పర్యటనలో ప్రధాని మోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. అక్కడ ఉన్న దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ.. భారత్లో ఒకప్పుడు పక్క కుర్చీ కూడా వదలకూడదని అనుకునేవాళ్లుఇప్పుడు సబ్సిడీలను వదిలేసుకుంటున్నారని మోదీ అన్నారు.  మోడీ మాటల్లో..ఓసారి నేను చెప్పాను.. మీరు ఇళ్లలో గ్యాస్ పొయ్యి వెలిగిస్తారు. సిలెండర్లో 500 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. మీరు 500 రూపాయలు భరించగలిగే పరిస్థితిలో ఉంటే సబ్సిడీ వదిలేయొచ్చు కదా అన్నాను..ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.. 40 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ స్వచ్ఛందంగా వదిలేసుకున్నాయిఒకప్పుడు పక్క కుర్చీ కూడా వదలకూడదని అనుకునేవాళ్లు.. ఇప్పుడు సబ్సిడీలను వదిలేసుకుంటున్నారుఅది కూడా.. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చెబితే చేయడం కాదు.. మామూలు చాయ్ అమ్ముకునేవాడు చెప్పినా చేశారుభారత్ గొప్ప దేశంవిశాలమైన దేశం, 125కోట్ల మంది జనాభా ఉన్నారుకానీ సింగపూర్ నుంచి చాలా నేర్చుకోవాలి.  
ప్రపంచం మారుతోంది భారత్ మారాలా.. వద్దా?
మంచి విషయం ఏమిటంటే, 125 మన దేశంలో ఎన్ని విశేషాలు, ఎన్ని శషభిషలు ఉన్నాయో.. అన్నే సింగపూర్లో కూడా ఉన్నాయి.అయినా కూడా.. ప్రతి ఒక్కరూ సింగపూర్ వాసి. ప్రతి ఒక్కరూ దేశనిర్మాణాన్ని భుజాలకు ఎత్తుకున్నారుమేం కూడా విషయంలో సింగపూర్ నుంచి చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాం
వసుధైక కుటుంబం.. అనే మంత్రం ఎక్కడినుంచి వచ్చిందో అక్కడ అదే భావన దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది, బలోపేతం చేస్తుంది. భావనను ముందుకు తీసుకెళ్లడానికి మేం కృషిచేస్తున్నామని మోడీ ప్రసంగించారు

« PREV
NEXT »

No comments

Post a Comment