తాజా వార్తలు

Friday, 27 November 2015

వీరప్పన్ కు ఎదురుతిరిగిన ఆయన భార్య

రెండు రాష్ర్టాల పోలీసులను గడగడలాడించిన వీరప్పన్ కు ఆయన భార్య ఎదురు తిరిగింది.వీరప్పన్ సతీమణి ముత్తు లక్ష్మీకు అంతటి ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది ? అసలు వీరప్పన్ చనిపోయి చాలా రోజుల అవుతుండగా ఈయన భార్య ఆయనకు ఎలా ఎదురు తిరుగుతుంది ? ఇలాంటి డౌట్స్ లు ఎన్నో మీ మదులను తొలుస్తున్నాయి కదా .

రామ్ గోపాల్ వర్మ వీరప్పన్ జీవిత కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాను తెరకెక్కించగా ఈ చిత్రం తెలుగ,తమిళం,హిందీ,కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సిద్దమయింది. ఈ చిత్రం డిసెంబర్ 4 విడుదల కానుందని వర్మ ఇటీవలే తెలియజేశారు.అయితే ఈ విషయం తెలుసుకున్న వీరప్పన్ సతీమణి ముత్తు లక్ష్మీ సినిమాను విడుదల చేయరాదని డిమాండ్ చేసింది.వర్మ కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీలో తెరకెక్కించడానికి మాతమ్రే తన దగ్గర అనుమతి తీసుకున్నారని ముత్తు లక్ష్మీ తెలిపింది.కన్నడ,తమిళ భాషల్లో విడుదల చేసేందుకు తన దగ్గర అనుమతి పొందలేదని,హిందీ,తమిళ భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేయాలంటే ముందుగా తాను ఆ సినిమా చూడాలని వీరప్పన్ సతీమణి డిమాండ్ చేసింది.కిల్లర్ వీరప్పన్ అనే టైటిల్ కూడా అభ్యంతరంగా ఉందని తెలిపిన ఈవిడ ట్రైలర్ లో వీరప్పన్‌ను హేళన చేస్తున్నట్టు చూపించారని తెలిపింది.

సినిమాలో వీరప్పన్ ను చెడుగా చూపిస్తే ఆ ప్రభావం తమ కుటుంబ సభ్యులపై పడుతుందన్న ముత్తు లక్ష్మీ , ఆ సినిమాను అడ్డుకోవడానికి కోర్టు అనుమతి పొందామని తెలిపారు.అయితే 2006 వ సంవత్సరంలోనే ముత్తు లక్ష్మీకు 31 లక్షలు అందించి కిల్లర్ వీరప్పన్ సినిమా హక్కులు పొందామని కన్నడ డైరెక్టర్ ఎ.ఎమ్ .రమేశ్ తెలిపారు.అన్ని భాషల్లో విడుదలకు సిద్దం చేసుకుంటున్న సమయంలో ముత్తు లక్ష్మీ ఇలాంటి అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని రమేశ్ వాపోయారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment