తాజా వార్తలు

Thursday, 5 November 2015

ఇండియాలోనే మొదటి అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌

ఇండియాలోనే మొదటి అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌ ను మైసూర్ లో ఏర్పాటు చేశారు. అంధుల లిపి అయిన బ్రెయిలీలో రైళ్ల రాకపోకల షెడ్యూల్‌ను తయారు చేసి ఈ స్టేషన్‌లో పెట్టారు. అనుప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్‌కు బీజం వేసింది. నెలన్నర క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ మొదటి విడతగా మైసూర్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ బోర్డులో రైళ్ల రాకపోకల వివరాలతో పాటు.. రైల్వే స్టేషన్‌లోని ఎంట్రీలు, ఎగ్జిట్‌లు, ప్లాట్‌ఫాములు, కౌంటర్లు, మరుగుదొడ్లు ఎటువైపు ఉన్నాయో సూచిస్తాయి. ప్రతి ప్లాట్‌ఫామ్ పైన 400 మెటాలిక్ బ్రెయిలీ గుర్తులు బిగించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment