తాజా వార్తలు

Tuesday, 17 November 2015

ఏపీ పోలీసులు అధికార పక్షానికి వంతపాడుతున్నరు-నాని

ఏపీ పోలీసులంతా సీఎం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. హైదరాబాద్‌లో అయితే తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్నారు. పార్టీ కార్యాలయం ఖాళీ చేయించే నెపంతో పోలీసులను తనపై ఉసిగొల్పారని, వారి బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదన్నారు. ప్రతిపక్ష నేతలపై ఏపీ సర్కార్ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నదన్నారు. సోమవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. మచిలీపట్నం పోర్టు భూసేకరణ, ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన వైసీపీ నేత పేర్ని నానిపై అక్రమంగా మూడు కేసులు బనాయించారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై తమ పోరాటం కొనసాగుతుందని నాని స్పష్టం చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment