తాజా వార్తలు

Friday, 27 November 2015

బాలయ్య ప్రేమలో పడ్డ నాని

నాని నిజంగా భలే భలే మగాడే.తన సినిమాలలో వైవిధ్యం చూపించి మెప్పించే ఈ హీరో ఇటీవల బాలయ్య ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.రీసెంట్ గా భలే భలే మగాడివోయ్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నాని త్వరలో హను రాఘవ పూడి డైరెక్షన్ లో చేయనున్నాడు.ఇందులో నాని బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా నటించబోతున్నాడు.

హను డైరెక్షన్ లో నాని ఓ చిత్రాన్ని చేస్తుండగా ఇందులో నాని బాలయ్య ఫ్యాన్ గా అలరించనున్నాడట.అందుకు సంబంధించి ఆయన చేతిపై జై బాలయ్య అనే టాటూ కూడా వేయించుకున్నాడు.ఈ విషయం
సైజ్ జీరో మూవీ ప్రీమియర్ షోకు హాజరైన సందర్బంగా తెలిసింది.ఇటీవల రామ్ చరణ్ కూడా బ్రూస్ లీ సినిమా కోసం బ్రూస్ లీ అనే టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు నాని చేయబోవు చిత్రంలో బాలయ్య అభిమానిగా ఏం చేస్తాడు,బాలయ్య డైలాగులేమైనా పేలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

బాలయ్య తో లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన 14 రీల్స్ నాని సినిమాను నిర్మిస్తుండగా,ఈ చిత్రం బాలయ్య ఫ్యాన్స్ ను ఎంతలా అలరిస్తుందో చూడాలి . 
« PREV
NEXT »

No comments

Post a Comment