తాజా వార్తలు

Monday, 30 November 2015

మగశిశువు కోసం డీఎన్ ఏ టెస్ట్

నల్లగొండ జిల్లాలో ఒకేసారి ప్రసవించిన ఇద్దరు తల్లులు ఆడ, మగశిశువులకు జన్మనిచ్చినప్పటికీ, మగశిశువు మావాడేనని గొడవకు దిగారు. అర్వపల్లి మండలం కోడూరుకు చెందిన గంట లావణ్య, నకిరేకల్ మండలం గుడివాడకు చెందిన గుండగాని పుష్పలత ప్రసవం కోసం సోమవారం సూర్యాపేట ఏరియా దవాఖానలో చేరారు. డాక్టర్ స్రవంతి ఇద్దరికీ ఆపరేషన్ చేశారు. లావణ్య చేతిపై పాప పుట్టిన గుర్తుగా ఎఫ్(ఫిమేల్), పుష్పలతకు బాబు పుట్టినట్లు చేతిపై ఎం(మేల్)అని స్కెచ్‌పెన్‌తో రాశారు. ఇద్దరు శిశువులను సిబ్బంది శుభ్రం చేసి తీసుకొచ్చాక లావణ్య బంధువులు మగశిశువును తీసుకోవడంతో పుష్పలత, ఆమె భర్త కృష్ణ అడ్డుకొని లాక్కున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి ఘర్షణకు దారితీసింది. ఇద్దరు తల్లులకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి శిశువులను అప్పగిస్తామని దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. దీంతో గొడువ సర్థుమనిగింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment