తాజా వార్తలు

Thursday, 19 November 2015

పాపం.. నిహారిక, ఎవరూ రాలేదట

ఒక మనసు సినిమా ప్రారంభోత్సవానికి మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదట. 'మెగా' ఫ్యామిలీకి చెందిన నిహారిక 'ఒక మనసు' అనే చిత్రంతో హీరోయిన్‌గా సినీ అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు సంబంధించిన పారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇటీవలే నిర్వహించారు. అయితే ఈ ఫంక్షన్‌కి 'మెగా' హీరోల్లో ఒకరు కూడా హాజరు కాలేదట.  టీవీ యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు కుమార్తె నిహారిక వెండి తెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలోనే 'ఒక మనసు' సినిమాలో హీరోయిన్‌గా నటించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె సినీ అరంగేట్రం మెగా ఫ్యామిలీకి నచ్చలేదని తెలుస్తోంది. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేవలం నిహారిక తల్లిదండ్రులు మాత్రమే హాజరవడం, మెగా హీరోలు రాకపోవడాన్ని బట్టి చూస్తే ఈ విషయం నిజమేనేమోనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వారు కార్యక్రమానికి రాకపోవడానికి వెనుక కారణాలు ఏమై ఉంటాయోనని వారు ఆరా తీస్తున్నారు. నిహారిక సినిమా ప్రారంభోత్సవానికి మెగా ఫ్యామిలీనుంచి ఎవరు రాకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
« PREV
NEXT »

No comments

Post a Comment