తాజా వార్తలు

Saturday, 7 November 2015

ముచ్చటగా మూడో సారి నితీష్ కుమార్ కే పగ్గాలు


బీహార్ ఎన్నికల ఫలితాల విషయంలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అయ్యాయి. మహాకూటమిదే గెలుపు అని ఐదు సర్వేలు ప్రకటించగా, మరో మూడు సర్వేలు ఎన్డీఏదే విజయం అని పేర్కొన్నాయి. ఇక మహాకూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. బీహార్ శాసనసభ ఫలితాలు బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీఎం నితీష్‌కుమార్‌ను ఉత్తేజపరుస్తున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మహాకూటమి గెలుపు దిశగా దూసుకెళ్తుంది. మహాకూటమి గెలుపు ఖాయమవుతున్న నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి నితీష్‌కుమార్ అధికారంలోకి రానున్నారు. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు నితీష్. మహాకూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్న క్రమంలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఆయా పార్టీ కార్యాలయాల్లో బాణాసంచా కాల్చుతూ హుషారుతో స్టెప్పులేస్తున్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని బీహార్ ప్రజలు చిత్తు చేశారు. ఆ రాష్ట్ర సీఎం నితీష్‌కుమార్ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమికే ప్రజలు పట్టం కట్టారు. మహాకూటమి 157 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ సందర్భంగా నితీష్‌కుమార్ మాట్లాడుతూ.. మహాకూటమికి పట్టం కట్టిన బీహార్ ప్రజలకు ధన్యవాదాలు. మహాకూటమికి సంపూర్ణ మద్దతిచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. ఇక చరిత్రాత్మక విజయం సాధించిన నితీష్‌కుమార్‌కు హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment