తాజా వార్తలు

Sunday, 29 November 2015

రిలీజ్ కు ముందే ఫుల్ బిజినెస్

జూనియర్ ఎన్టీఆర్ ,సుకుమార్ కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో అనే చిత్రం తెరకెక్కగా ఈ చిత్రం వడి వడిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ ను సాధించి జూనియర్ గత సినిమా రికార్డులను తిరగరాస్తోంది.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటుండగా,ఆడియోను డిసెంబర్ 13 న విడుదల చేయనున్నట్టు సమాచారం.

నాన్నకు ప్రేమతో చిత్రం ప్రస్తుతం 3 ఏరియాల్లో 31 కోట్ల బిజినెస్ ను సాధించి అందరికి షాక్ ఇచ్చింది. నైజాంలో అభిషేక్ అనే వ్యక్తి ఈ చిత్ర రైట్స్ ను 16 కోట్లకు దక్కించుకోగా,సీడెడ్ రైట్స్ 8.45 కోట్లకు,ఓవర్సీస్ రైట్స్ 7.10 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.అయితే ఇవేకాక చెన్నై,కర్ణాటక ,మిగతా కోస్తా ఏరియాలలో కలిపి మొత్తం 60 కోట్ల వరకు బిజినెస్ జరగొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా 
« PREV
NEXT »

No comments

Post a Comment