తాజా వార్తలు

Saturday, 28 November 2015

ప్రమాదాలకు అడ్డాగా ఔటర్ రింగ్ రోడ్డు

ఔటర్ రింగ్‌రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారుతున్నది. హిమాయత్‌సాగర్ సనా ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్టీమ్ కారు అదుపు తప్పి డివైఢర్‌ను ఢీకొట్టి అమాంతం ఎగిరిపడి..ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో మొదటి కారులో ప్రయాణిస్తున్న విజయ్‌కుమార్(26), గీతా రాణి(45), తనూజ(40) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారం రోజుల క్రితం మాజీ డీజీపీ పేర్వారం రాములు మనుమలు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే..
« PREV
NEXT »

No comments

Post a Comment