తాజా వార్తలు

Tuesday, 17 November 2015

మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ

పాలమూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.  జిల్లాలోని ఎదిర గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఈ కాలేజీ నిర్మాణానికి, ఫర్నీచర్, పరికరాల కోసం రూ.450 కోట్లు విడుదల చేసింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం గతంలోనే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇచ్చింది. దీని ఆధారంగానే అధికారులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పంపించారు. అనంతరం ఇద్దరు అధికారులు ఢిల్లీకి వెళ్లి అప్లికేషన్ హార్డ్‌కాపీని అందించారు. జిల్లాలో కాలేజీ ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం వెనువెంటనే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు, కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని కూడా గుర్తించింది. ఈ కాలేజీ మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు అనుబంధంగా పనిచేస్తుంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment