తాజా వార్తలు

Saturday, 21 November 2015

26నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ పక్ష నేతలు ఈ నెల 24న భేటీ కానున్నారు. 26 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అధికార పక్షం తరఫున విపక్షంపై ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై నేతలు చర్చలు జరపనున్నారు.ఈ నెల 24న సాయంత్రం అమిత్ షా నేతృత్వంలో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో సమావేశం కావాలని నిర్ణయించారు. 25న ప్రధాని మోదీ నివాసంలోనూ సమావేశం జరగనుంది. శీతాకాల సమావేశాలకు ముందు మిత్రపక్షాల నేతలకు విందు ఇవ్వాలని భావించే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే, శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న బిల్లులు, తీసుకోనున్న నిర్ణయాలను ప్రధాని మోదీయే స్వయంగా మిత్రపక్షాలకు వివరించనున్నట్లు తెలిసింది. బిహార్‌ లో ఎన్‌డీఏ ఘోర పరాజయం నేపథ్యంలో ఈ సమావేశాలు సజావుగా జరిగే అవకాశం లేదని పరిశీలకులు ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు భేటీ అయి.. తమకు అప్రతిష్ఠ రాకుండా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. 
« PREV
NEXT »

No comments

Post a Comment