తాజా వార్తలు

Friday, 27 November 2015

వర్మ మాటలకు రెస్పాండ్ అయిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒక సంచలనం.ఆయన మాట ఒక వేదం,ఆయన ఆలోచనలు అభిమానులకు మార్గదర్శకాలు.మరి అంతలా అభిమానుల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పవన్ ఇటీవల వర్మ మాటలకు రెస్పాండ్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.సినిమా లేదా రాజకీయాలకు సంబంధించిన అన్ని విషయాలను తన ట్విట్టర్ ద్వారా తెలిపే పవన్ ఇప్పుడు ఓ కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నాడని సమాచారం.

పవన్ నోటి నుండి లేదంటే ఆయన ట్విట్టర్ నుండి వచ్చే సమాచారం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుండగా,మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు తన సందేశాన్ని తెలిపేందుకు త్వరలో ఓ యూ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.సినిమాలు,రాజకీయాలకు సంబంధించిన వీడియోలన్నీ ఇందులో ఉండనున్నాయట.ఇన్నాళ్లు ట్టిట్టర్ లో తన ఒపీనియన్ ను చెప్పిన పవన్ ,అవి కేవలం చదువుకున్న వారికే చేరుతున్నాయని భావించారట.దాని వలన రూరల్‌లో ఉన్న అభిమానులకు కూడా తన సందేశాలు చేరేలా పవన్ ఈ యూ ట్యూబ్ ఛానల్ ప్లాన్ చేసాడనే ప్రచారం జరుగుతుంది.

ఈ యూ ట్యూబ్ ఛానల్ ప్లాన్ వెనుక వర్మ కామెంట్స్ కారణమనే వార్తలు వస్తున్నాయి.పవన్ ట్విట్టర్ ఒపీనియన్స్ ,చదువుకోని వాళ్ళకు ఎలా అర్ధమవుతాయని కొద్ది రోజుల క్రిందట వర్మ ప్రశ్నించగా,దానికి సమాధానమే ఈ యూ ట్యూబ్ ఛానల్ అంటూ ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది.మరి దీనిపై అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment